పెళ్లి చేయమన్న కొడుకుని గొడ్డలితో నరికిన తండ్రి !

Join Our Community
follow manalokam on social media

ఈ మధ్య కాలంలో ఎక్కువగా దారుణాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. మందు మనుషుల్ని మృగాలను చేస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాద్‌నగర్ కొత్తూరు మండలం చేగూర్ గ్రామంలో తండ్రి కొడుకుల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాహం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెల రేగింది. తనకు తొందరగా వివాహం చేయాలని తండ్రి మీద కొడుకు ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు.

మద్యం మత్తులో కొడుకు మీద తండ్రి ఎల్లయ్య గొడ్డలి తో దాడి చేసినట్టు చెబుతున్నారు. కొడుకు నరేష్ కు తీవ్ర గాయాలు కావడంతో అతనిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న నందిగామ పోలీసులు. తండ్రిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి చేయమని అడిగితె కొడుకు మీద గొడ్డలితో దాడి చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. 

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...