జాతీయ రహదారిపై భద్రతా దళాలపై దాడులు చేయడంలో ఉగ్రవాదులు ఉపయోగించిన ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసామని జమ్మూ పోలీసులు చెప్పారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఓజిడబ్ల్యు) ను అరెస్టు చేసారు. పోలీస్ స్టేషన్ పంతా చౌక్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్…
ఈ ఏడాది ఆగస్టు 14 నుండి అక్టోబర్ 5 వరకు వరుస దాడులు జరిగాయని చెప్పారు. ఆగస్టు 14 న శ్రీనగర్ లోని నౌగామ్ లో పోలీసులు, ఎస్‌ఎస్‌బి వ్యక్తులపై జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఆ తర్వాత పోలీసుల నుంచి ఉగ్రవాదులు రైఫిల్ ని కూడా లాక్కున్నారు. గనైమోహల్లాకు చెందిన వసీమ్ అహెంద్ గనాయ్, చటర్‌గమ్ కు చెందిన చాదూరా, అరిబాగ్ కు చెందిన ఫైసల్ ముష్తాక్ గనాయ్, నౌగామ్, మార్వెల్ కు చెందిన షకీర్ అహ్మద్ దార్, కాకాపోరా, పుల్వామా, సుహైల్ షబీర్ గనామాలా , ఇక్బాల్ కాలనీకి చెందిన ఉమర్ నిసార్, షేకర్పోరా, నౌగామ్, శ్రీనగర్ మరియు అరిబాగ్, నౌగామ్ కు చెందిన సాహిల్ నిసార్ ని అరెస్ట్ చేసారు.