చిన్న సినిమాకి పెద్ద స్పందన.. ఫస్ట్ ఓటీటీ బ్లాక్ బస్టర్..

-

థియేటర్లు మూసి ఉన్న కారణంగా సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదల అవుతున్నాయి. ఐతే ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజైన చాలా చిత్రలకి అంత పెద్దగా స్పందన రాలేదనే చెప్పాలి. కానీ ఒక్క సినిమాకి మాత్రం ఓ రేంజిలో స్పందన వస్తుంది. అదే కలర్ ఫోటో. యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాని హృదయ కాలేయం సినిమాతో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం నిర్మించారు. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి అటు ప్రేక్షకుల నుండి ఇటు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి స్పందన వస్తుంది. స్టార్ హీరోలు, దర్శకులు సైతం కలర్ ఫోటోని పొగుడుతున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా తెరకెక్కిన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. అదీగాక ఇప్పటి వరకూ ఆహాలో ఎక్కువ మంది చూసిన సినిమాగా కలర్ ఫోటోనే ఉందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే కలర్ ఫోటో పెద్ద హిట్టనే చెప్పాలి. ఓటీటీలో ఈ రేంజ్ స్పందన రావడమంటే బ్లాక్ బస్టర్ అనక తప్పదు. చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news