బండి సంజయ్ కు స్మృతి మద్దతు.. చొరబాటుదారులు కోసం లేఖలు రాశారు !

బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కామేంట్స్ మీద స్మృతి ఇరానీ ఆయనకు తన మద్దతు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే.. అక్రమ చొరబాటు దారులకు ,రోహింగ్యాల కు ఓటర్ లిస్ట్ లో చేర్చారని అన్నారు. అక్రమ చొరబాటు దారుల పై లోకల్, నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని అన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదేదేనని ఆమె అన్నారు. ఎంఐఎం నేతలు లెటర్ హెడ్స్ పై చొరబాటు దారులకి సౌకర్యాలు కల్పించాలని సిపార్స్ చేశారని ఆమె అన్నారు.

స్వచ్ఛ , పారదర్శక పాలన కోసం బీజేపీ కి ఓటు వేయండని అన్నారు. అక్రమ చొరబాటు దారులు పంపించాలనే విషయంలో పార్టీ ప్రభుత్వం ఒకే విధానం అని దేశ సంపద దేశ ప్రజలే అనుభవించాలని ఆమె అన్నారు. కేంద్ర సహకారం తో 920 కోట్ల కొరియా ప్రాజెక్టు తెలంగాణ కి వచ్చిందని ఆమె అన్నారు. తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలర్పించారు.. వాళ్ళు కన్నా కలలు కల్లలు అయ్యాయి..  వాళ్ల కుటుంబాల గుండెలు పగిలాయని అన్నారు. దుబ్బాక తో ప్రజల సపోర్ట్ అధికార పార్టీ కి లేదని తేలిపోయిందని ఆమె అన్నారు.