పురుషుడి ఆహార్యం…వాయిస్ …పురుషిడిలా ప్రవర్తించే నటి ఎవరంటే టక్కున గుర్తొచ్చేది సింగర్ స్నిగ్ధ . గాయనిగా అడుగు పెట్టి నటిగా రాణిస్తోంది. అయితే మగాడి పోలికలకు దగ్గరగా ఉండటంతో ఆమెను చాలా మంది దర్శకులు ఆ తరహా పాత్రలే ఎక్కువగా చేయిస్తారు. దీంతో స్నిగ్ధ గాయనిగా కన్నా నటిగా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. పొట్ట కూటి కోసం కోటి విద్యలు అన్న చందాన్న స్నిగ్ధ కూడా ఇదేదే బాగుందని ఆ పంథానే కొనసాగిస్తోంది. అయితే ఈ కారణంగా ఆమెను చాలా మంది ఎగతాళి చేసినవాళ్లు, విమర్శించిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో వీటిన్నటింపై స్పందించింది.
భగవంతుడు అమ్మాయిలా పుట్టించాడు.మంచి వాయిస్ ఇచ్చాడు. గాయనిగా మంచి పేరొచ్చింది. అమ్మాయి వాయిస్‌తో అబ్బాయి గా మారడానికి ఎందుకు ప్రయత్నిస్తాను? ఒకవేళ అబ్బాయిలా మారాలానుకున్న అది చిన్న విషయం కాదు. ఒకవేళ నేను అబ్బాయి లా మారాలి అనుకుంటే విమర్శించిన వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నా. నన్ను విమర్శిస్తున్నారంటే? వాళ్లంతా కచ్చితంగా మూర్ఖులు అనే భావిస్తాను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటో పోయేదిమి లేదు. ఆ వాయిస్ నాకు మంచి జీవితాన్ని ఇచ్చింది. మగాడి గొంతులా ఉందేంటని ఎప్పుడూ ఫీలవ్వలేదు. అవ్వను కూడా. ఆ గొంతు లేకపోతే ఈరోజు ఈస్థాయిలో ఉండేదాన్ని కాదేమో. అందరి ఆడ పిల్లాల్లా మిగిలిపోయేదాన్ని. దేవుడు మగాడి వాయిస్ ఇచ్చి మంచి పని చేసాడని తెలిపింది.
స్నగ్ధ రెడ్డి ని నటిగా టాలీవుడ్ కి పరిచయం చేసింది నందిని రెడ్డి. ఆమె తొలి సినిమా అలా మొదలైంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. స్నిగ్ధ తెరపై కనిపిస్తే ప్రేక్షకులు నవ్వుతారు. ఆమె ఆహార్యం, హావభావాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అందుకే నలభైకు పైగా సినిమాలు చేయగలిగింది. ఇటీవల నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబి లో కూడా నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో స్నిగ్ధకు మరింత గుర్తింపు దక్కింది. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.