దూసుకొస్తున్న సింగం..ఈసారి మిసైల్-4?

-

యాక్ష‌న్ ప్యాకెజ్డ్ సినిమాల‌కు పెట్టింది పేరు సూర్య‌. ఆ ఎన‌ర్జీకి ద‌ర్శ‌కుడు హ‌రి తోడ‌య్యాడు అంటే! యాక్ష‌న్ లెవ‌ల్ పీక్స్ కు చేరుకుంటుంది. అందుకే సింగం, సింగం-2 చిత్రాలు తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను న‌మోదు చేసాయి. సింగం-3 మాత్రం అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. కోలీవుడ్ లో ప‌ర్వాలేదు గానీ…టాలీవుడ్ లో మాత్రం డిజాస్ట‌ర్. ఈ నేప‌థ్యంలో యూనిట్ ఆలోచ‌న‌లో ప‌డిన‌ప్ప‌టికీ సింగం-4 కూడా ప్ర‌క‌టించారు. అయితే ఎప్పుడు సెట్స్ కు వెళ్లుంద‌న్న‌ది మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. తాజాగా సిగం-4 స్టోరీ ప‌నులు స్టార్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. టైటిల్ కూడా మ‌ర్చేస్తున్న‌ట్లు తెలిసింది. సింగం కాస్త మిసైల్ 4 గా మార్చార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. స్టోరీ సోల్ మాత్రం కొత్త‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

singam 4 Now As Missail4

సింగం-3 తెలుగులో ఆడ‌ని నేప‌థ్యంలో కొత్త కంటెంట్ ను తీసుకున్న‌ట్లు తెలిసింది. అయితే సూర్య యాక్ష‌న్ లో మాత్రం పెద్ద‌గా మార్పులేవి ఉండ‌వ‌ట‌. ఫ్రెష్ కంటెంట్ ను తీసుకుని సూర్య డ‌బుల ఎన‌ర్జీని ట్రిపుల్ చేసి చూపించ‌నున్నారుట‌. స్వ‌దేశీ నేప‌థ్యంలో క‌థ ఎక్కువ‌గా సాగ‌నుంద‌ని అంటున్నారు. మ‌రో ర‌కంగా చెప్పాలంటే ఓ నిజాయితీగల ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ‌లా ఉంటుంద‌ని అంటున్నారు. అలాగ‌ని బయోపిక్ కాదు. ఫిక్ష‌న‌ల్ గానే ఉంటుంద‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌! అన్న‌ది అధికారికంగా వెల్ల‌డిస్తే గానీ తెలియ‌దు.

ప్ర‌స్తుతం సూర్య కె. వి ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా, లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. కె. వి ఆనంద్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. సుధ కొంగ‌ర సినిమా సెట్స్ లో ఉంది. ఈ రెండు రిలీజ్ అయ్యే స‌రికి 2019 ఏడాది పూర్త‌వుతుంది. హ‌రి వేరు వేరు క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్నాడు. అవ‌న్నీ పూర్త‌యితే మిసైల్ -4పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news