ఉడికించిన వేరుశెనగపప్పు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..!!

-

వేరు శనగపప్పు ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి లేదు. దీనిని పేద వాడి బాదం పప్పు అనికూడా అనవచ్చు. ఎందుకంటే బాదం లో ఉండాల్సిన పోషకాలాన్ని వేరుశెనగ లో పుష్కళంగా ఉన్నాయి. బాదాంపప్పు కొనలేని వారికి వేరు శనగపప్పు మేలు కలిగిస్తుంది.వీటిని అలాగే పచ్చివి లేదా వేయించినవి లేదా ఉడికించినవి తినవచ్చు. రోజుకో గుప్పెడు పల్లీలు వుండికించి తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పల్లీల్లో విటమిన్ ఇ, మెగ్నీషియం,మోనోశాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉంటాయి.వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా కొంతవరకు తగ్గించుకోవచ్చు.శరీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. ఇందులో విటమిన్‌ ఇ, b1, b6, ప్రోటీన్‌, మాంగనీసు,అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. యాంటీఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండే ప్రోటీన్ లు కణాలు, కణజాల మర్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా కాపాడుతుంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది: వేరుశెనగపప్పులోని అవసరం అయ్యే అమినో యాసిడ్స్ మెదుడు నాడీకణాలను క్రమభద్దికరించి,మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.ఇందులో ఉండే విటమిన్ ఇ అల్జిమర్స్ బారిన పడకుండా కాపాడుతుంది.

అధిక కొవ్వు తగ్గించడంలో :వేరుశెనగపప్పులో అధిక న్యూట్రీషియంట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడి,మెటబాలిజంను పెంచుతుంది.

ఎముకల ఆరోగ్యానికి : పల్లీల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలోని క్యాల్షియమ్‌, విటమిన్‌ డిలు ఎముకపుష్టికి దోహదపడతాయి.

క్యాన్సర్ నివారిస్తుంది: పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్‌ అనే పాలిఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు రాకుండా మన శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

చర్మం ఆరోగ్యానికి : ప్రతి వందగ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్‌ ‘ఇ’ ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ ను నిరోధిస్తుంది.

ఎదిగే పిల్లల ఆరోగ్యానికి: వీటిలో ప్రోటీన్లు, విటమిన్స్ అధికంగా ఉంటాయి.ఎదిగే పిల్లలకు ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. తరుచుగా గుప్పెడు పల్లీలు పిల్లలకి స్నాక్ లా ఇస్తూ వుంటే వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news