సో ప్రౌడ్ అఫ్ యు బావ.. డైరెక్టర్ బాబిపై ద్రోణవల్లి హారిక ట్వీట్..

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13 న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.. నాకు బాబీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే అయితే త్వరలోనే చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాబి మరదలు ద్రోణవల్లి హారిక కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన ద్రోణవల్లి హారిక గ్రాండ్ మాస్టర్ గా అందరికీ తెలుసు భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ అయిన రెండో మహిళ ద్రోణవల్లి హారిక ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్షిప్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ టోర్నీలో పథకాలు సాధించింది అలాగే ఏమైనా భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు అంటే ఈమెకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు కానీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రానికి దర్శకత్వం వహించిన బాబి ఈమెకు బావ అవుతారు.. హారిక సోదరి అనూషను బాబీ వివాహం చేసుకున్నారు.. అయితే బాబీ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా విడుదల అయ్యే ముందు ఆమె అతనికి వీటిలో శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.. బాబి విక్టరీ వెంకటేష్ తో తీసిన వెంకీ మామ సినిమా విడుదల అవటానికి ముందు కూడా ఇదే విధంగా శుభాకాంక్షలు తెలిపారు.. అలాగే ఈసారి కూడా త్వరలోనే వాల్తేరు వీరయ్య సినిమా విడుదలవుతున్నాను నేపథ్యంలో అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు..

విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను టీవీలో చూసిన హారిక.. బాబీ, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసి బావకు శుభాకాంక్షలు తెలిపారు… అలాగే ‘‘సో సో సో ప్రౌడ్ ఆఫ్ యు బావ. నువ్వు ఎంత కష్టపడతావో నాకు తెలుసు. నీ రాబోయే విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వేచి చూస్తున్నా’’ అంటూ చెప్పకు వచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news