ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బుడమేరు వాగుకుమరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో బెజవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు బుడమేరు కాలువకు పడిన గండ్లను అధికారులు యుద్ధప్రాతిపదికన పూడుస్తున్నారు. మరోసారి భారీ వరద వస్తే కాలువకు మళ్లీ గండ్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుడమేరు లోతట్టు ప్రాంతాల ప్రజలు నేటికి ఆ విపత్తు నుంచి తేరుకోలేదు.
అయితే, తాజాగా బుడమేరు వాగు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిన మింగేసినట్లు తెలుస్తోంది.మచిలీపట్నంకు చెందిన ఐటీ ఉద్యోగి ఫణికుమార్(40)బుడమేరు వరదలో చిక్కుకుని గల్లంతయ్యాడు. అతని కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆయన వినాయకచవితి సందర్భంగా సొంతూరుకు వచ్చాడు.శనివారం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి మచిలిపట్నం బయలుదేరగా, బుడమేర ఉధృతి గురించి వారు హెచ్చరించినా వినకుండా వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతని కారు వరదలో చిక్కుకోగా చివరకు కొట్టుకునిపోయాడు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.