హైదరాబాద్ మహానగరంలోని చెరువులు, నాలాలు, కుంటల పరీరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా వ్వవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ సంస్థ స్వతంత్రంగా తన పనిని తాను చేసుకుని ముందుకు వెళుతోంది. ప్రభుత్వం తరఫున ఫుల్ ఫ్రీడమ్ ఉండటంతో అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా చెరువు ప్రాంతాల స్థాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది.అంతేకాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. ఇలాంటి వ్యవస్థ జిల్లాల్లోనూ తేవాలని కొందరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, నగరంలో అక్రమ కట్టడాలు కూల్చివేతలో కమిషనర్ రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక ఇదే తరహా వ్యవస్థ జిల్లాల్లోనూ వస్తే ప్రభుత్వ భూముల కబ్జా ఆగిపోతుందని ప్రజల అభిప్రాయం. అయితే,హెచ్ఎండీఏ పరిధిలోని 7జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం ఉన్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు బ్రేక్ పడనుంది.