మ్యూజిక్‌ పాఠాలు నేర్పించమంటే… బట్టలిప్పి యువతిపై లైంగిక దాడి

-

బెగుసరై పత్‌కౌలా గ్రామం కిషన్ దేవ్ చౌరాసియా(45) అనే ఒక వ్యక్తి ఒక మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అతడు ఓ యువతికి (20)కి మ్యూజిక్ నేర్పిస్తున్నాడు. ఇది ఇలా ఉంటె, అతను, ఆ యువతిపై కన్నేశాడు. తన కూతురి వయసున్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. ఆ మాష్టారుపై విరుచుకుపడ్డారు. అంతేకాదు.. ఆ యువతితో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరి బట్టలు ఊడదీసి కొట్టారు. అంతటితో ఆగకుండా.. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.

Marital rape exposes our society's inherent misogyny | VIEW - India Today

సంగీత పాఠాలు చెప్పాల్సిన మాష్టారు లైంగిక వేధింపులకు పాల్పడటంతో.. కిషన్ సింగ్ చౌరాసియాపై పోక్సో చట్టం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు మరికొన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. అలాగే.. మాష్టారుతో పాటు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నామని చెప్పారు పోలీసులు . ఎట్టి పరిస్థితుల్లోనైనా వారిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు పోలీసులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news