జగన్ ని ఇబ్బంది పెడుతున్న నేతలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చర్యలు సిఎం జగన్ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పార్టీ నాయకులు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజకీయం చేయకూడని సమయంలో రాజకీయం చేయడమే కాకుండా ఎన్95 మాస్కులను వైసీపీ నేతలు పెట్టుకుని తిరగడ౦ స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా జగన్ ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కొందరు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.

సోషల్ మీడియాలో వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అనవసర ప్రసంగాలను వైసీపీ నేతలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఇటీవల మర్కాజ్ యాత్రికులపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర దుమారమే రేగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యవహారశైలి కూడా జగన్ ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన విశాఖ, విజయనగరం నుంచి అమరావతికి వస్తున్నారు పదే పదే. ఎన్నికల కమీషనర్ ని కలిసి అభినందనలు తెలపడానికి ఆయన వచ్చారు. కేంద్ర మంత్రులు కూడా ఇళ్ళల్లో ఉంటున్నారు.

కానీ ఆయన మాత్రం స్వేచ్చగా అటు ఇటు తిరగడం మాస్క్ లు వైద్యులు పెట్టుకునేవి ఆయన పెట్టుకోవడం వంటివి విమర్శలకు వేదికగా మారాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం… నూతన ఎన్నికల కమీషనర్ ని క్వారంటైన్ లేకుండా తీసుకొచ్చింది. చంద్రబాబు వస్తే క్వారంటైన్ అవసరం అని చెప్పిన మంత్రులు… ఇప్పుడు కనగరాజు ని దేశంలో ఎక్కువ కేసులు ఉన్న తమిళనాడు నుంచి తీసుకు రావడం ఏంటీ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇవన్ని కూడా ఇప్పుడు ప్రజల్లో అభిప్రాయం మారుస్తున్నాయి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news