కరోనా వ్యాప్తిపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆదివారం ఆయన కరోనాపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశ౦ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై అధికారులు, మంత్రులతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సిఎస్, ఆరోగ్య శాఖా మంత్రి, డీజీపీ ఇలా కీలక అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్… రాష్ట్రంలో కరోనా కేసులు 531 చేరడం తో ఆయన ఈ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే వైరస్ వ్యాప్తి ఆగడం లేదనే విషయం స్పష్టమవుతుందని అన్నారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రజల సహకారం లేకపోతే కట్టడి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసారు. పరిస్థితి తీవ్రత ప్రజలు అర్ధం చేసుకుని ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
మర్కాజ్ కి వెళ్లి వచ్చిన వారికి పరిక్షలు నిర్వహించాలని, నిర్వహించిన వాళ్ళకే మళ్ళీ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. అందరూ కూడా పరిక్షలకు హాజరు కావాలని సూచించారు. దేశంలో రాష్ట్రంలో కరోనా ఆగడం లేదని, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుందని అన్నారు. అధికార యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఎవరికి లక్షణాలు కనపడిన పరిక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు.