తమ ఇళ్లకు రావొద్దంటూ గ్రామ వలంటీర్లపై దాడి.. ఏం జ‌రిగిందంటే..!

-

గ్రామ వలంటీర్లపై కొంద‌రు దాడికి పాల్పడడమే కాకుండా కిడ్నాప్‌కు యత్నించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం, గుడిమూల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావద్దని హెచ్చరిస్తూ గ్రామవలంటీర్లపై కొంద‌రు దాడికి పాల్పడ్డారు. అంతేకాక సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామానికి చెందిన వలంటీర్లు గుబ్బల రాజేష్, బత్తుల సునీల్‌లపై.. బొలిశెట్టి దుర్గాప్రసాద్, నామన రంగబాబు, నాయుడు కృష్ణస్వామి, నాయుడు ఆదినారాయణ అనే వ్యక్తులు రాడ్లతో దాడి చేశార‌ట‌.

అనంతరం తనను కారులో ఎక్కించుకుని వేరే ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా గ్రామస్థులు కొందరు కారును వెంబడించడంతో మరో గ్రామంలో తనని వదిలి వెళ్లారని వలంటీర్ రాజేష్ చెప్పాడు. 6777 నంబరు కలిగిన తెలుపురంగు షిఫ్ట్‌కారులో వచ్చి తమపై దాడి చేశారని రాజేష్, సునీల్‌ వెల్లడించారు. వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంపై వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సర్వేకు వెళ్లిన వారిపై సదరు వ్యక్తులు దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై వలంటీర్లు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news