నేను సారాయి వీర్రాజు కాదు.. కోడిగుడ్ల వీర్రాజును : సోము వీర్రాజు

-

ఆంధ్ర ప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాభై రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రెండు లక్షల రూపాయలు మిగులుతాయని.. పేర్కొన్నారు. తాను సారాయి వీర్రాజు కాదని.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024 లో బి.జె.పి మ్యానిఫెస్టోలో పెడతామని.. .ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సమస్యకు బి.జె.పి దగ్గర పరిష్కారం ఉందని పేర్కొన్నారు.

నేను లిక్కర్ గురించి పేదవాడిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడానని… ఆరు రూపాయలు బాటిల్ ను 200 రూపాయలకు అమ్మడాన్ని నేను ప్రోత్సహించనని పేర్కొన్నారు. నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు అని… నాపై ట్వీట్ చేసిన కె.టి.ఆర్. తండ్రి తెల్లవారుజాము మూడు గంటల వరకూ ఏం చేస్తారని చురకలు అంటించారు. బి.జె.పి ఏ విషయాన్నైనా సమయం, సందర్బంతో మాట్లాడుతోందన్నారు. గుంటూరు జిన్నా టవర్ పేరును వై.సి.పి ప్రభుత్వం మార్చాలన్నారు. లేదంటే 2024లో అధికారంలోకి వచ్చాక జిన్నా టవర్ పేరు మార్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news