డయాబెటిస్ మొదలు హృదయ సమస్యల దాక పనసతో ఎన్నో ఉపయోగాలు..!

-

పనస ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చి పనసకాయ తో కూర చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. పనస తో బిర్యాని కూడా చేసుకోవచ్చు. అలానే ఆ గింజల్లో కూడా పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని కూడా తీసుకోవచ్చు. అయితే పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే పనస తో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

 

హృదయ ఆరోగ్యానికి మంచిది:

హృదయ ఆరోగ్యానికి పనస ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది.

ఎముకలకు మంచిది:

పనస తీసుకోవడం వల్ల ఎముకలకు కూడా మంచిది. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనితో ఎముకలు దృఢంగా ఉంటాయి.

డయాబెటిస్ వాళ్లకి కూడా మంచిది:

డయాబెటిస్ సమస్య తో బాధపడే వారికి పనస ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి ఇది సహాయం చేస్తుంది.

బీపీ ఉన్న వాళ్ళకి మంచిది:

బీపీ ఉన్న వాళ్లకి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. టెన్షన్ ని కూడా ఇది తగ్గిస్తుంది. అలానే ఎనీమియా సమస్యని తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

పనసని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఇది రక్షిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news