కృష్ణా జిల్లా చిన్నారి ప్రాణాలు కాపాడిన సోను సూద్…!

కరోనా కష్ట సమయంలో ప్రముఖ నటుడు సోను సూద్ ప్రజలకు తన వంతుగా ఏదోక సహాయం చేస్తున్నారు. దేశం నలుమూలలా అతను ఏదోక సహాయం చేస్తూనే ఉన్నాడు. అడిగిన వారికి కాదు అనకుండా ఎంతో కొంత సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా కృష్ణా జిల్లా చిన్నారికి సోను సాయం చేసాడు. గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన చిన్నారి గాయత్రి అనే పాపకు అతను సహాయం చేసాడు.

సోనూసూద్ సహకారంతో గత నెల 28 న ముంబయిలో ని ఎస్ ఆర్ సి సి చిల్డర్న్స్ హాస్పిటల్ లో గుండెకు శస్త్ర చికిత్స చేయగా అది విజయవంతం అయింది. ఈ నేపధ్యంలో పాప ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆరోగ్యంగా ఉండాలని సోనూసూద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. పాప కుటుంబం మొత్తం కూడా సోను సూద్ కి ధన్యవాదాలు చెప్పింది.