సుదీర్ఘ కరోనా గ్యాప్ తర్వాత నేడు ఏపీలో స్కూల్స్ రీఓపెన్

-

ఎట్టకేలకి నేటి నుండి ఏపీలో స్కూల్స్ లో ఓపెన్ కానున్నాయి. విడతలవారీగా స్కూల్ రీ ఓపెనింగ్ షెడ్యూల్ ని ఏపీ ప్రభుత్వం ఫిక్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా గైడ్ లైన్స్ ని పాటిస్తూ ఈ స్కూల్స్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్ సెకండియర్ తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి.

అలానే ఈనెల 16 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా మొదలు కానున్నాయి. ఈ రోజు నుంచే డిగ్రీ,పిజి కాలేజ్ తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక వర్కింగ్ డేస్ 180 రోజులు పాటు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. అలానే కోల్పోయిన విద్యా సంవత్సరానికి కవర్ చేసేలా సిలబస్ ని రూపొందిస్తున్నారు. స్కూల్లో సామాజిక దూరం అలానే మాస్కులు తప్పనిసరి చేశారు అధికారులు. ఈ రోజు నుంచి మొదలైన స్కూల్స్ వచ్చే ఏప్రిల్ నాటికి అకాడమిక్ ఇయర్ ముగ్గు ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news