ఢిల్లీలో చలి పులి.. 58 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత !

-

ఢిల్లీలో చలిపులి వణికిస్తోంది. ఓ పక్క ఇప్పటికే కరోనా మహమ్మారి, మరో వైపు కాలుష్యం టెన్షన్ పెడుతోండగా దానికి ఇక ఇప్పుడు ఈ చలి పులి కూడా తోడైందని చెప్పచ్చు. ఈ చలి దెబ్బకు దేశ రాజధానిలో ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబరు నెల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై రికార్డ్ సృష్టించాయి. గత 58 ఏళ్ల లో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబరు నెలలో దేశ రాజధాని లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తేలింది.

ఢిల్లీలో, 1994 సంవత్సరంలో అక్టోబరు 31న 12.3 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 1962 , అక్టోబరు నెలలో 16.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, 58 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబరు నెలలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఢిల్లీలో 1937 అక్టోబరు 31 వ తేదీన “ఆల్-టైమ్” అత్యల్ప ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో నిన్న ఉదయం అసాధారణ రీతిలో 11.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ సీజన్ లో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రతగా ఇది రికార్డ్ సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news