హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ లక్ష్మిశ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం తీసుకుంది. దుండిగల్ మల్లంపేట కత్వ చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆరోపణ వచ్చాయని..శ్రీ లక్ష్మిశ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం తీసుకుంది.
కాసేపట్లో విల్లాల కూల్చివేతకు సిద్ధమవుతోంది హైడ్రా. దింతో శ్రీలక్ష్మిశ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇప్పటికే ప్రముఖ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ తో పాటు పలు అక్రమ కట్టడాలను కూల్చేస్తూ వస్తోంది హైడ్రా. తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ నటుడు, వ్యాపారవేత్త మురళి మోహన్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి సంస్థలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది.