అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే.. కేసీఆర్ సర్కార్ దూకుడుగా ముందుకు వెళుతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలను త్వరితగతిగా అమలు చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే, తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ లో భాగంగా మరో వందకు పైగా బస్తీ దవాఖనాలను అర్బన్ ప్రాంతాల్లో నెలకొల్పనుంది.
మొదటి దశలో రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో 85 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయగా, వీటిని ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. తొలిదశ సక్సెస్ కావడంతో, రెండో దశలో భాగంగా అర్బన్ ప్రాంతాల్లో 101 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు జారీ చేసింది. 63 అర్బన్ లిమిట్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాదాపు ఒక్కో క్లినిక్ ను రూ.13.2 లక్షలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జనాభా ప్రకారం ఒక్కో ప్రాంతంలో రెండు కంటే ఎక్కువ బస్తీ దవాఖానాలను ప్రభుత్వం నెలకోల్పుతోంది.