దేశ‌వ్యాప్తంగా ఆన్‌లైన్ లో ఆవుల‌పై ఎగ్జామ్‌.. ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు..!

-

దేశంలో ఉన్న ఆవుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రీయ కామ‌ధేను ఆరోగ్య (ఆర్‌కేఏ) ఫిబ్ర‌వ‌రి 25న దేశ‌వ్యాప్త ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నుంది. అది కూడా ఆవుల‌పై. అవును, నిజ‌మే. ఈ త‌ర‌హా ప‌రీక్షను నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి కాగా ఇందులో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు. ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో ఆవుల గురించి ఉంటుంది. అన్నీ ఆబ్జెక్టివ్ త‌ర‌హా ప్ర‌శ్న‌లే ఉంటాయి. మొత్తం 4 విభాగాల్లో ప్ర‌శ్న‌ల‌ను అడుగుతారు. ఆవు గురించిన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు, దానిపై ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించేందుకే ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని ఆర్‌కేఏ వెల్ల‌డించింది.

soon you can write exam on cows for free

కాగా ఆర్‌కేఏ ఆధ్వర్యంలో నిర్వ‌హించ‌నున్న కామ‌ధేను గౌ విజ్ఞాన్ ప్ర‌చార్ ప్ర‌శ‌ర్ ఎగ్జామినేష‌న్ లో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు. ప‌రీక్ష‌ను ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష మొత్తం 12 ప్రాంతీయ భాష‌ల‌తోపాటు హిందీ, ఇంగ్లిష్‌ల‌లో ఉంటుంది. 100 వ‌ర‌కు మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌ల‌ను అడుగుతారు. 1 గంట‌లో ప్ర‌శ్నా ప‌త్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ సంద‌ర్భంగా ఆర్‌కేఏ చైర్మ‌న్ వ‌ల్ల‌భ్‌భాయ్ క‌థిరియా మాట్లాడుతూ.. ఆవు అంటేనే విజ్ఞానం, దాని గురించి అంద‌రికీ తెలియాలి. మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాలి. 5 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ఉన్న మ‌న దేశంలో ఆవు ముఖ్య పాత్ర పోషిస్తుంది.. అని అన్నారు. ఇక ఈ ఎగ్జామ్ గురించిన మ‌రిన్ని వివ‌రాల‌ను, సిల‌బ‌స్‌ను ఆర్‌కేఏకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో త్వ‌ర‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. ఈ ఎగ్జామ్‌కు గాను ఎలాంటి ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సిన ప‌నిలేదు. ఉచితంగా రాయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news