సీనియర్ నటుడు మృతి.. విషాదంలో ఇండస్ట్రీ

కరోనా మహమ్మారి మరో నటుడిని మింగేసింది. బెంగాలీ సీనియర్ యాక్టర్ సౌమిత్ర ఛటర్జీ కోవిడ్‌-19తో ఈరోజు మధ్యాహ్నం ఆయన చనిపోయారు. ఆస్కార్ అవార్డు గ్రహీట్త దర్శకుడు సత్యజిత్ రేతో కలిసి అనేక చిత్రాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న సౌమిత్ర కి ఇప్పుడు 85 ఏళ్లు. అక్టోబర్ 6 న కోల్‌కతాలోని బెల్లె వి ఆస్పత్రిలో జాయిన్ అయిన సీనియర్ నటుడు సౌమిత్ర ఛటర్జీ బ్రతకాలి అంటే కచ్చితంగా ఏదయినా అద్భుతం జరగాలి అని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు ప్రకటించిన కాసేపటికే ఆయన కన్నుమూశారు.

చికిత్సకు ఛటర్జీ స్పందించడం లేదని, ఈ పరిస్థితిలో అద్భుతాలు జరగాలి” అని నిన్న ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ పేర్కొన్నారు. సౌమిత్ర ఛటర్జీ కుటుంబానికి సమాచారం ఇచ్చామని నిన్ననే డాక్టర్లు ప్రకటించారు. ఆస్పత్రిలో జాయిన్ అయిన వారం తర్వాత ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. అయినా ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆయన కన్నుమూశారు. ఇక ఆయన మరణం సంగతి తెలిసి దేశంలోని అందరు సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే బెంగాలీ ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగిపోయింది.