ఇక నుండి రోజూ లక్ష టెస్టులు చేయనున్న డిల్లీ..

-

ఢిల్లీలో కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం వల్ల కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలొ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా తో జరిపిన సుధీర్ఘ చర్చల అనంతరం మీడియాతొ మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్, కరోనా విస్తరణని అడ్డుకునేందుకు తీసుకునే చర్యలని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఐసీయూ బెడ్లకి అదనంగా మరో 750 బెడ్లు జతచేస్తున్నామని తెలిపాడు.

ఈ మేరకు కేంద్రం మాటిచ్చిందని అన్నాడు. ఐతే ఇకపై కరోనా టెస్టులు కూడా పెంచుతున్నామని, రోజూ లక్ష కరోనా టేస్టులు చేయబోతున్నామని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగానే కరోనా టెస్టులని పెంచుతున్నట్లు వివరించాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ రేంజిలో ఉందో అందరికీ తెలిసిందే. దానివల్లే కరోనా కూడా పెరుగుతుందన్న కారణంగా దీపావళి పండగపూట క్రాకర్స్ కాల్చడం నిషేధించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news