సౌత్ ఆఫ్రికాకు ఓటమి తప్పదా, టాప్ ప్లేయర్స్ అందరూ అవుట్ !

-

ఈ రోజు కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్యన సెమి ఫైనల్ 2 జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా సారధి టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సౌత్ ఆఫ్రికా కు దిష్టి తగిలిందో ఏమో కానీ… టాప్ 4 ఆటగాళ్లు టపా టపా మని అవుట్ అయ్యి పెవిలియన్ చేరిపోయారు. ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో నాలుగు సెంచరీ లతో చెలరేగిన డి కాక్ ఈ మ్యాచ్ లో ఉసూరుమనిపించాడు. డి కాక్ (3), బావుమా (0), డస్సెన్ (6) మరియు మార్ క్రామ్ (10) లు వెంట వెంటనే అవుట్ అయిపోయి ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మరియు హాజిల్ వుడ్ లు తలో రెండు వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికా ను చావు దెబ్బ కొట్టారు. దాదాపుగా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఓటమి ఖరారు అయిపోయింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం ఆట జరగకుండా వర్షం వచ్చి అడ్డంకిగా మారింది. ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 44 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరి క్రీజులో ఉన్న మిల్లర్ మరియు క్లాజెన్ లు సఫారీలను ఆదుకుంటారా అన్నది తెలియాలంటే వర్షం ఆగే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news