సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్ కు “కేన్” మామ రెడీ !

-

ఈ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్లు అంచనాలకు మించి రాణిస్తూ సెమీస్ కు చేరువలో ఉన్నాయి. ఏమైనా అద్భుతములు జరిగితే తప్ప ఈ రెండు జట్లు సెమీస్ చేరడం దాదాపు ఖాయమే. కాగా ఈ రెండు జట్ల మధ్యన రేపు సమరం జరగనుంది. ఇరు జట్లలో అసాధారణ ఆటగాళ్లు ఉండడంతో పోటీ మాములుగా ఉండేలా లేదు. కాగా ఈ సందర్భంగా న్యూజిలాండ్ జట్టుకు ఒక శుభవార్త అని సమాచారం కాసేపటి క్రితమే అందింది. వరల్డ్ కప్ మొదట్లో గాయం కారణంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొన్ని మ్యాచ్ లకు దూరమైన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జట్టు యాజమాన్యం నుండి తెలుస్తున్న ప్రకారం విలియమ్సన్ గాయం నుండి కోలుకుని రేపటి మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడట. ఇతను కనుక జట్టులోకి యాడ్ అయితే అదనపు బలం చేకూరినట్లు అవుతుంది.

కాగా సమఉజ్జీల మధ్యన జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరు విజయాన్ని అందుకోనున్నారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news