సౌత్ ఆఫ్రికాలో అల్లర్లు.. కాలిపోతున్న ఇంటి పై నుండి బిడ్డని కిందకి పడేసిన తల్లి..!

-

మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా గత వారం జైలు శిక్ష కారణంగా సౌత్ ఆఫ్రికా లో హింస మరియు అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ హింస కారణంగా 72 మంది మరణించారు మరియు 1,234 మందిని అరెస్టు చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ గందరగోళం మధ్య, ఒక తల్లి తన రెండు సంవత్సరాల బిడ్డని కాలిపోతున్న ఇంటి నుండి రక్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.


ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. డర్బన్‌లోని బిల్డింగ్ కాలిపోతున్న సమయంలో నలేది మన్యోని తన బిడ్డను రక్షించుకోవాలని బిడ్డని కిందకి విసిరేయడం ఈ వీడియోలో ఉంది. అది అంతా కూడా మంటలు, పొగ చుట్టుముట్టడంతో తల్లి ఆ చిన్నారిని మొదటి అంతస్తు నుండి కిందనున్న జనం వైపుకి విసిరేసింది.

పొగతో ఆ ప్రదేశం అంత నిండి వుంది. నాకు చాలా భయం వేసింది. ప్రజలు బిడ్డని విసిరేయండి అని అరుస్తూ ఉన్నారు. నేను ఆ సమయంలో చాల భయపడ్డాను అని ఆమె అంది. అయితే ఆ సమయంలో బిడ్డని విసిరేసాను. ఆమెకి ఏ గాయాలు అవ్వలేదు తరవాత నేను నా బిడ్డని కలుసుకున్నాను అని ఆమె అంది.

దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటాల్ మరియు గౌటెంగ్ ప్రావిన్సులలో ఘోరంగా దాడులు జరిగాయి. దొంగతనాలు కూడా జరిగాయి. కిరాణా, దుస్తులు మరియు మద్యం దుకాణాలలో ఎక్కువగా దొంగతనాలు జరిగాయి. కోర్టు మద్దతుతో జుమాకు 15 నెలల జైలు శిక్ష విధించిన తరువాత ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news