మొదటిసారి మీడియా ముందుకు వైఎస్‌ షర్మిల

రేపు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత వైఎస్‌ షర్మిల మీడియా ముందుకు రావడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా తమ పార్టీ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే…. జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, పరిశీలకులను ప్రకటించనున్నారు వైఎస్‌ షర్మిల.

అంతేకాదు… మెంబర్ షిప్ డ్రైవ్, అక్టోబర్ లో పాదయాత్ర పై వైఎస్‌ షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. జూలై 8 వ తేదీన వైఎస్ షర్మిల.. కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. “వైఎస్సార్ తెలంగాణ పార్టీ” గా పార్టీకి నామకరణం చేశారు షర్మిల.

గ్రాఫిక్స్ రూపంలో పార్టీ అజెండా ప్రకటించారు వైఎస్ షర్మిల. తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వేదిక పై వెళ్ళిన వైఎస్ షర్మిల.. వైఎస్సార్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు. పార్టీ ఆవిర్భావం అనంతరం… నిరుద్యోగ సమస్యలపై వైఎస్‌ షర్మిల దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మంగళవారం రోజుల దీక్ష చేశారు షర్మిల.