భారత దేశం గర్వించ దగ్గ లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూశారు. సుమారు నలభై రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. దీంతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. ఆగష్టు 5న అయనకు కరోనా సోకడంతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కరోన తగ్గినా ఇంకా లంగ్స్ సంబందింత సమస్యలతో బాధ పడుతుండడంతో ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఆయన ఆయన డిశ్చార్జ్ కూడా అవనున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం మళ్ళీ విషమంగా మారిందని బులెటిన్ కూడా రిలీజ్ అయింది. చివరికి పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాశ విడిచారు. ఆయన మరణించడంతో యావత్ సినీ పరిశ్రమే కాక యావత్ దేశమే విషాదంలో మునిగిపోయింది.
ఆయనకు పలువు సినీ, రాజకీయ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం జూన్ 4 1946న జన్మించారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆయన పూర్తి పేరు. ప్లేబాక్ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన సంగీత దర్శకుడుగా పని చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో ఆయన సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరినా చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన కెరీర్ మొదలు పెట్టారు. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత కన్నడ, హిందీ లాంటి భాషల్లో కూడా అయన పాటలు పాడారు.