ఎస్పీ బాలు ఇంటి దగ్గర శుభ్రం చేస్తున్న సిబ్బంది.. అసలు బాలు కి ఏమైంది.. ?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజు రోజుకి క్షిణిస్తున్న విషయం తెలిసిందే. అయన మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావాలని, ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పడాలని ఎన్నో కోట్ల మంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాలు ఆరోగ్యం గురించి దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే ఇప్పుడు అయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ చికిత్సనందిస్తున్న ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎంజీఎం ఆసుపత్రికి పలువురు ప్రముఖులు కూడా ఆయన్ని చూడడానికి వెళ్లడంతో అభిమానుల్లో కలకలం మొదలయింది. అసలు బాలు గారికి ఏమైంది అన్న ప్రశ్న అందరిని కలిచివేస్తుంది.

అంతేకాకుండా ఎస్పీ బాలు నివాసం ఉంటున్న వీధులన్నీ శుభ్రం చేసి, కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లడం పై కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. ఎస్పీబీ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. కరోనా నుంచి బాలు గారు కోలుకున్న తర్వాత అందరు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇతర అనారోగ్య సమస్యలు తిరగబెట్టినట్టు తెలిసింది. దీంతో.. గురువారం నుంచి మళ్ళీ ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఎప్పుడు ఈ వార్త వినాలిసి వస్తుందో అని అభిమానులు భయంతో ఆసుపత్రి ఎదుట బారులు తీశారు. దీనితో ఎంజీఎం ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.