ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్ను మూశారు. కరోనాతో పోరాటం చేస్తూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మధ్యాహ్నం ఒంటి గంటా నాలుగు నిమిషాలకు ఆయన కన్ను మూశారు అని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన పాటలు పాడారు. 74 ఏళ్ళ బాలు పాటలకు ప్రపంచం మైమరిచిపోయింది. కమల్ హాసన్ సహా పలువురు తమిళ హీరోలకు ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు.
ఆగస్ట్ 4 న్ ఆయన కరోనాతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆరోగ్యం విషమించింది. 29 సార్లు నంది అవార్డ్ తీసుకున్నారు. 16 భాషల్లో 40 వేల పాటలు పాడారు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. తెలుగు తమిళం, కన్నడం సహా అనేక భాషల్లో ఆయన పాటలకు మంచి డిమాండ్ వచ్చింది.