నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’తో మరోసారి మాస్ ఆడియెన్స్‌ను మెప్పించి, భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నాని మళ్లీ మాస్ ఇమేజ్ను రీబిల్డ్ చేసుకుంటూ, వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి భారీ సినిమా ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇందులో జడలు వేసుకున్న హీరో నాని.. జైల్లో కనిపించాడు. అలాగే ఈ వీడియోలో ఫైట్ సీన్ కూడా ఉంది. ఊర మాస్ లుక్ లో హీరో నాని కనిపించాడు. ఈ సినిమాకు ఈ జైలు జైలు చాలా హైలెట్ గా మారనుంది.