ఏడు పదుల వయసులో పర్యావరణ రక్షణపై యువతకు అవగాహన కల్పించడానికి సైకిల్ యాత్ర చేపట్టారు స్పీక్ మాకే సంస్థ వ్యవస్థాపకుడు, 73 ఏళ్ల డాక్టర్ కిరణ్ సేథ్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్రలో గురువారం రోజున రిషికేశ్ చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజలు సాదరస్వాగతం పలికారు.
సైకిల్ తొక్కడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక అభివృద్ధి కూడా జరుగుతుందని కిరణ్ సేథ్ పేర్కొన్నారు. అక్టోబరు 2 నాటికి తన సైకిల్‌యాత్ర దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు ఆయన 1,000 కి.మీ. ప్రయాణించారు. కిరణ్.. ఖరగ్‌పుర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో పీహెచ్డీ చేశారు.
ఈ వయసులో 1500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిరణ్ సేథ్. ఈ యాత్రలో దాదాపు 2500 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు. యువతకు పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికే సైకిల్ యాత్రను చేస్తున్నట్లు డాక్టర్ కిరణ్ సేథ్ తెలిపారు. సైకిల్‌తో కలిగే ప్రయోజనాలను యువతకు తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు.