ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై పారకుండా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలగా ఉండి మద్యపాన నిషేధం విషయంలో కీలక అడుగులు వేసారు. మద్యం ధరలను పెంచడమే కాకుండా సామాన్యులకు మద్యాన్ని అందుబాటులో ఉంచడం లేదు. బార్ల సంఖ్యలు కూడా బాగా తగ్గాయి రాష్ట్రంలో. మద్యం కొనాలి అంటే ఇప్పుడు ధనవంతులే గాని తక్కువ వాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఏపీలో లేదు.
ఈ తరుణంలో ఇప్పుడు ఏపీలో ఆందోళనకర విషయం బయటకు వచ్చింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంతో పాటుగా ఉత్తరాంధ్రలో భారీగా సారా కాస్తున్నారు. మద్యం ధరలు భారీగా ఉండటంతో అందరూ కూడా ఇప్పుడు నాటు సారా మీద ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరకు రావడం, ఎంత కావాలి అంటే అంత దొరకడం గమనార్హం. దీనిపై ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేసారు.
ఆయన నాటా సారాపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతుందని, ఎక్సైజ్ శాఖా నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. సారాతో పాటుగా గంజాయి, నిషేధిత గుట్కా, విచ్చలవిడి గా దొరుకుతుంది అని అన్నారు. నాటు సారా మాఫియా తో రాత్రికి రాత్రే కొందరు కోటీశ్వరులు అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్ దీనిపై దృష్టి పెట్టి కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు.