ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. 30 లక్షల దిశగా కరోనా కేసులు వెళ్తున్నాయి. మరణాలు కూడా రెండు లక్షలకు దగ్గరగా ఉన్నాయి. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఆ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అమెరికాలో కరోనా వైరస్ వల్ల మరణాల సంఖ్య 50వేలు దాటిందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ఇప్పటి వరకు 51 వేల మంది చనిపోయారు.
అమెరికాలో మొత్తం 894,475 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడ 90 వేల మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 28 లక్షలకు దగరగా ఉన్నాయి. అమెరికాలో 7,53,335 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని అధికారులు వివరించారు. 15,042 మంది ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 194454 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
7,70,976 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. అమెరికా తర్వాత అత్యధిక కేసులు స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, టర్కీల్లో అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో కరోనా వైరస్ కేసులు 24 వేలకు దగ్గరగా ఉన్నాయి. మరణాలు 800 దగ్గరగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.