వారికి గుడ్‌న్యూస్‌ చెప్పి టీఎస్‌ఆర్టీసీ.. ఆ రూట్‌లో స్పెషల్‌ బస్సులు

-

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఐటీ కారిడార్‌లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్‌’ బస్సును నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నడవనుంది. నగర ఐటీ కంపెనీల్లో దాదాపు 5 లక్షల మంది వుమెన్​ ఎంప్లాయ్స్ ఉన్నారు.

ఫస్ట్​ బస్సు జేఎన్‌టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయల్దేరి బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి క్రాస్​ రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది.సాయంత్రం 5.50 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్‌టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఈ సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని రోడ్డు రవాణా సంస్థ భావిస్తోంది. ఈ బస్సుల్ని మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విటర్ లో షేర్​ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version