30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

-

ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సభ సంతాపం తెలపనుంది. ఈ క్రమంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి  శాసన సభ నివాళులు అర్పించనుంది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. భారత దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్కు వయసు 92 ఏళ్లు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర నేతలు, బంధువులు ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సిక్కు సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news