పీఎం కిసాన్‌ డబ్బులు ఇంకా అందలేదా…? అయితే ఇలా చెయ్యండి…!

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతులు కోసం కూడా కేంద్రం పలు పథకాల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో ఒకటి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీని ద్వారా రైతులు నేరుగా డబ్బులు పొందొచ్చు. వాళ్ళ బ్యాంక్ ఎకౌంట్ లో సురక్షితంగా డబ్బులు పడిపోతాయి.

అయితే కొంత మంది ఈ స్కీమ్ ‌లో చేరినా కూడా డబ్బులు రాక పోవచ్చు. ఇలాంటి వారి జాబితా లో మీరు కూడా ఉన్నట్లయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. వీటిని మీరు చెక్ చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. చిన్నపాటి తప్పుల వలన ఇంకా డబ్బులు మీ ఖాతా లో పడి ఉండక పోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో తప్పులు దొర్లడం కారణంగా మీకు డబ్బులు రాకపోవచ్చు. అయితే మీరు ఆన్‌లైన్‌ లోనే ఈ తప్పులను కరెక్ట్ చెయ్యచ్చు.

దీని కోసం ముందు మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దీని పై క్లిక్ చేసి సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్, క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏవి తప్పులు ఉన్నాయో వాటిని సరిచేసుకోవాలి. ఆ తరువాత సబ్‌మిట్ చేయాలి. మీ పని పూర్తి అయిపోయినట్లే.

ఇప్పటికే చాలా మంది రైతులు ఈ పథకం లో చేరారు. మోదీ సర్కార్ ఇస్తున్న రూ.2 వేలు పొందుతూ వస్తున్నాయి. రైతులకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు లభిస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news