ఇప్పటి దాకా రెండు తెలుగు రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాయితీ ఎంత పెద్దగా సాగిందో చూశాం. ఏపీ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ మంత్రులు అయితే వైఎస్సార్‌ను తీవ్ర స్థాయిలో దూషించారు. కానీ షర్మిల మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఎటు మాట్లాడినా తనకు ఇబ్బందులు వస్తాయని ఇన్ని రోజుల కాస్త సైలెంట్ గా ఉంది.
ఇక ఇప్పుడు సందర్భం వచ్చినట్టుంది. ఈరోజు తన పార్టీ వైఎస్సార్ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించింది. తన పార్టీ వైఖరిని అందరికీ చెప్పారు షర్మిల. తాను ఎల్లప్పుడూ కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన వాటాలపై కొట్లాడుతానని చెప్పింది.
ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాలను అడ్డుకోబోనని స్పష్టంగా తెలిపింది. దీంతో ఇప్పుడు ఈమె మాటలు చూస్తుంటే ఇటు తెలంగాణ తో పాటు అటు ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా చాలా ఆలోచనాత్మకంగా షర్మిల వ్యాఖ్యానించిందని ఆమె అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మొత్తానికి షర్మిల తెలంగాణ ప్రజల మనస్సు గెలుచుకునే మాటలు మాట్లాడిందని తెలుస్తోంది.