అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్ నియామకం

-

అంతర్వేది దేవాలయానికి చెందిన రథం దగ్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అటు తిరుగి ఇటు తిరిగి ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంతో పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన ఏపీ ప్రభుత్వం అంతర్వేదిలో గతంలో ఈవోగా పనిచేసిన అధికారిని బదిలీ చేసి ఆయన స్థానంలో కొత్త వారిని నియమించారు. అయినా హిందూ సంఘాలు, వీహెచ్‌పీ, బీజేపీ, జనసేనలు ఆందోళనలకు దిగడంతో అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్ ని నియమించింది ఏపీ ప్రభుత్వం.

స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ని నియమించారు. అంతర్వేదిలో పరిస్థితి పర్యవేక్షించాలని దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. 15 రోజుల పాటు అంతర్వేదిలోనే ఉండాలని రామ చంద్ర మోహన్‌ కు జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు. కొత్త రథం నిర్మాణం సహా పరిస్థితులు కొలిక్కి తీసుకురావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news