నేడే ఇండియా… చైనా ఫేస్ టూ ఫేస్

-

రష్యాలో గురువారం సాయంత్రం జరిగే ఎస్సీఓ సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం ఆసక్తికరంగా మారింది. భారతదేశం, చైనా దళాల మధ్య లడఖ్‌ లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) మంత్రివర్గ సమావేశానికి విదేశాంగ మంత్రులు హాజరుకానున్నారు. తరువాత గురువారం సాయంత్రం 6 గంటలకు ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. ద్వైపాక్షిక చర్చలతో పాటు, రష్యా-ఇండియా-చైనా (ఆర్‌ఐసి) విదేశాంగ మంత్రుల సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. కాగా ఇటీవల భారత్ చైనా సరిహద్దుల్లో కాల్పులు కూడా జరిగాయి. ఈ భేటీపై ఆసియా దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news