తలైవా171 నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్…. మాస్ లుక్ లో రజనీకాంత్

-

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తలైవా 171 గా ఈ సినిమా రాబోతుండ‌డంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా నుంచి లోకేష్ సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు.

ఈ చిత్రం నుంచి రజినీకాంత్ ఫ‌స్ట్ లుక్‌ను లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదిక‌గా విడుద‌ల చేశాడు.

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ను ఏప్రిల్ 22న రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. చేతి వాచ్లను చైనా పట్టుకుని ఉన్న రజనీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనుండగా.. శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు.ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి రీసెంట్‌గా ఒక ఇంట‌ర్వ్యులో పాల్గోన్న లోకేష్ మాట్లాడుతూ.. తలైవా 171 నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్‌ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news