వేగంగా కోలుకుంటున్నా: సద్గురు జగ్గీ వాసుదేవ్

-

ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వేగంగా కోలుకుంటున్న అని తెలిపారు. తాజాగా వేగంగా కోలుకుంటున్నట్లు తెలియజేస్తూ సద్గురు ఓ వీడియోను ఎక్స్(ట్విట్టర్) లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆస్పత్రిలో బెడ్ పై పేపర్ చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు . ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేశారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు టెస్టులు చేయగా.. ఆయనకు లో మెదడులో భారీ రక్తస్రావం, వాపు ఉన్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news