బాబర్ ఓ విఫల కెప్టెన్: షాహిద్ అఫ్రిది

-

వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఆశించిన రీతిలో ప్రదర్శన చేయకపోవడంతో కెప్టెన్ బాబర్ అజామ్ పై షాహిద్ అఫ్రిది కీలక కామెంట్స్ చేశారు. ‘కెప్టెన్గా తనను తాను నిరూపించుకోవడానికి బాబర్కు నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చారు. ఆ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేదు. జట్టులోని ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోలేక పోయారు. యూనిస్ ఖాన్ నాయకత్వ లక్షణాలు బాబర్లో లేవు’ అని అఫ్రిది వ్యాఖ్యానించారు. “నేను బాబర్‌ని విమర్శిస్తున్నానని ప్రజలు అంటున్నారు. అతను నాకు సహోదరుని లాంటివాడు. కెప్టెన్సీ గురించి తెలుసుకోవడానికి మరియు నాయకుడిగా మెరుగుపడేందుకు అతనికి మూడు-నాలుగేళ్ల సమయం ఇవ్వబడింది. మేమంతా ఆయనకు మద్దతు ఇచ్చాం, ఎక్కడా ఎలాంటి ఒత్తిడి లేదు. అయితే, అతను విఫలమయ్యాడు, ”అని అతను చెప్పాడు.“ఒక నాయకుడు ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే కాకుండా అందరినీ తన వెంట తీసుకువెళతాడు. యూనిస్ ఖాన్ ఒక నాయకుడు మరియు అతను మాతో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదు, ”అన్నాడు ఆఫ్రిది.

ఇది ఇలా ఉంటె, పాకిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ మిక్కీ అర్థర్.. జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యేకించి- కేప్టెన్ బాబర్ ఆజమ్‌కు తన మద్దతు తెలిపాడు. కేప్టెన్‌గా బాబర్ ఆజమ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని వ్యాఖ్యానించాడు. ప్రతి రోజూ ఓ కొత్త పాఠాన్ని నేర్చుకుంటోన్నాడని, విమర్శలకు బదులుగా ఎదగడానికి అవకాశం కల్పించాలని అన్నాడు. బాబర్ ఓ అద్భుతమైన బ్యాటర్ అనే విషయం అందరికీ తెలిసిందేనని, కొన్ని సార్లు వైఫల్యాలు వెంటాడక తప్పవని మిక్కీ అర్థర్ చెప్పాడు. తాను చేసే తప్పులను సరిదిద్దుకుంటూ మరింత రాటుదేలుతాడని అన్నాడు. ఎదురు దెబ్బలు తిన్నప్పుడే జట్టు తన పనితీరును మరింత మెరుగుపర్చుకుంటుందని అభిప్రాయపడ్డాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version