HCAకు షాక్‌.. 57 క్లబ్‌లపై వేటు.. ఒక దఫా పోటీ చేయకుండా నిషేధం

-

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో బహుళ క్లబ్‌లతో హెచ్‌సీఏను శాసిస్తున్న క్రికెట్‌ పెద్దలకు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీ షాకిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్‌లపై జస్టిస్‌ నాగేశ్వరరావు వేటు వేశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఒక దఫా లేదా మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయా క్లబ్‌లు, వాటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీలపై నిషేధం విధించారు.

80 క్లబ్‌లను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది, వారి కుటుంబ సభ్యులు హెచ్‌సీఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు పర్యవేక్షక కమిటీ గుర్తించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్‌ నాగేశ్వరరావు..  కొందరు వ్యక్తులు బహుళ క్లబ్‌లు కలిగి ఉండటాన్ని గుర్తించాపు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్న 57 క్లబ్‌లపై అనర్హత వేటు వేశారు. ఆ క్లబ్‌లు, వాటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీల్లో ఉన్నవాళ్లు ఒక దఫా లేదా మూడేళ్ల పాటు హెచ్‌సీఏ ఎన్నికలకు దూరమైనట్లు ప్రకటించారు. ఈ క్లబ్‌లు రానున్న ఎన్నికల్లో పాల్గొనకుండా, ఓటు హక్కు వినియోగించకుండా నిషేధం విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version