టీమిండియా, పాక్ బౌలింగ్ మధ్య వ్యత్యాసంపై మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మ్యాచ్ లో కామెంటేటర్ గా అక్తర్ మాట్లాడుతూ.. భారత పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిసతారని.. అదే వారికి పాక్ పేసర్లకు ఉన్న తేడా అని పేర్కొన్నారు. పాక్ పేసర్ల ముఖాల్లో ఉన్న కసి… టీమిండియా పేసర్లలో ఉండదని ఎద్దేవా చేశారు. దీనికి కారణం.. తాము తినే తిండి, వాతావరణ అని అక్తర్ చెప్పారు.
పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో.. ఇతర విషయాల గురించి ఆలోచన చేయబోరని.. బ్యాట్స్ మెన్స్ ను చంపైనా వికెట్ తీయడమే లక్ష్యంగా పెట్టుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ దృకత్పథమే వారికి వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుందని.. దీకి తోడు తాము ఎక్కువగా మాంసాహారం తింటామన్నారు. దీని వల్ల దృఢంగా ఉంటామని.. ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే.. సింహాల్లా పరుగెడతామని స్పష్టం చేశారు. ప్రస్తుత తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రీదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు ఉన్నాయని అక్తర్ చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.