హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు

ఈనెల 25న హైదరాబాదులో భారత్ – ఆస్ట్రేలియా టి-20 సిరీస్ లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడవ టి-20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడి తొక్కేసలాట కూడా జరిగింది. దీనికి సంబంధించి ” హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్” పై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

టికెట్లపై సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని ముద్రించారు. కానీ ఆట మాత్రం ఏడు గంటలకే ప్రారంభమైందని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటికే టికెట్ విక్రయ సమయంలో తీసాలాట పై ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ కొత్త కేసుతో హెచ్సిఎ పై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.