ఆసియా క్రీడల్లో భారత్ కి మరో స్వర్ణం.. బోపన్న-రుతుజ జోడీ అదుర్స్..!

-

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సంచనాలు సృష్టిస్తున్నారు. జరిగే ప్రతీ ఈవెంట్ లో కూడా ఏదో ఒక మెడల్ ను సాధిస్తున్న ప్లేయర్ల భారత్ ఖాతాలోకి ఇప్పటివరకు ఎన్నో పతకాలను సాధించి పెట్టారు. తాజాగా టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న-రుతుజా భోసలే స్వర్ణ పతాకాన్ని సాధించారు. శనివారం జరిగిన మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ లో ఈ జోడీ చైనీస్ తైపీ జోడీ, తొమ్మిదో సీజ్ సుంగ్-హావో హువాంగ్, ఎన్-షువో లియాంగ్ పై 2-6, 6 తేడాతో విజయం సాధించారు. 

మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత జోడీ సరబ్ జోత్ సింగ్, దివ్య టీఎస్ రజత పతాకాన్ని సాధించాడు. గోల్డ్ మెడల్ కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఫైనల్స్ లో చైనా జోడీ 16-14 తేడాతో ఇండియాను బీట్ చేసి స్వర్ణ పతాకన్ని కైవసం చేసుకుంది. చైనీస్ షూటర్లు జాంగో బోవెన్, జియాంగ్ కాంగ్జిన్ లు తమ ఖాతాలో గోల్డ్ మెడల్ వేసుకున్నారు. ఇప్పటివరకు షూటింగ్ లో పతకాల సంఖ్య 19 కి చేరుకోగా.. అన్ని గేమ్స్ మొత్తం టీమిండియా 35 పతకాలను సొంతం చేసుకుంది. అందులో భారత్ ఖాతాలో 9వ స్వర్ణాలు, వ13 రజతాలు, 13 కాంస్య పతకాలను సాధించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version