కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

-

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను కుక్క కరిచింది. ఈ విషయాన్ని ఆయనే తన స్నేహితులతో చెప్పారు. గత కొద్ది రోజులుగా ప్లేయింగ్ 11 లో చోటు దాక్కకపోయినప్పటికీ.. ప్రాక్టీస్ లో మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. నేడు లక్నో – ముంబై మధ్య మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా కుక్క కరిచింది.

దీంతో బౌలింగ్ చేసే ఎడమ చేతికి కరవడంతో ప్రాక్టీస్ చేయకుండానే వెళ్ళిపోయాడు అర్జున్. తన స్నేహితులైన యుధ్వీర్ సింగ్, మోసిత్ ఖాన్ లతో మాట్లాడుతూ.. తన ఎడమ చేతి పై కుక్క కరిచిందని.. అందుకే ప్రాక్టీస్ చేయడం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news