ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా సొంత ఇంట్లో హత్యచేయబడిన విషయం తెలిసిందే. ఈ కేసు దాదాపుగా చాలా కాలం నుండి విచారణలోనే ఉంది. దర్యాప్తు సంస్థలు మారుతున్నాయి, కానీ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. కాగా తాజాగా కొంతకాలం నుండి సిబిఐ రంగంలోకి విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉందని తెలుసుకున్న సిబిఐ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా… అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలుకు వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. కాగా నిన్ననే మళ్ళీ సిబిఐ ఈ రోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కానీ అవినాష్ రెడ్డి ఈ రోజు రావడం కుదరడం లేదు అని రిప్లై ఇచ్చాడు. ఈ సమాధానానికి ఇష్టపడని సిబిఐ మళ్ళీ నోటీసులు ఇచ్చింది.
ఈ నోటీసులో 19వ తేదీన విచారణకు హాజరు కావాలని పేర్కొంది. మరి ఆ రోజైనా అవినాష్ రెడ్డి విచారణకు హాజరు అవుతాడా లేదా అన్నది చూడాలి. ఈ లెక్కన సిబిఐ అవినాష్ రెడ్డిని వదిలేలా కనిపించడం లేదు.